Koppula Eshwar | ధర్మపురి, సెప్టెంబర్ 05: రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నదనీ, రికార్డు స్థాయిలో రుణాలు తీసుకుంటూ ప్రజలపై అప్పు భారం మోపుతున్నదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22నెలల్లోనే రూ. 2లక్షల 50వేల కోట్లకు పైగా అప్పు చేసిందని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు కేవలం రూ.2లక్షల 83వేల కోట్లే నని, బీఆర్ఎస్ తీసుకున్న రుణంతో రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామని. ప్రజారంజక పథకాలు అమలు చేశామని, ఎన్నో అభివృద్ధి పనులు చేశామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుగ్గారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గా లిపల్లి మహేష్ అద్యక్షతన మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావ్, ఎమ్మెల్సీ రమణ లతో కలిసి మాజీ మంత్రి ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనున్నదని, కేవలం 22 నెలల్లో రూ.2లక్షల 50వేల కోట్లు అప్పు చేయడమనేది కాంగ్రెస్ ఆర్థిక విధానాలలో లోపాలను ,నిర్వహణలో అసమర్ధతను స్పష్టంగా తెలియజేస్తున్నదన్నారు. తెచ్చిన అప్పు డబ్బులు ఎక్కడ వినియోగిస్తున్నారనే దానిపై స్పష్టత లేదన్నారు. ఈ అప్పు భారం చివరికి సామాన్యుడి పై పడే ప్రమాదమున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు పెరగడం, సేవలకు ధరలు పెరగడం, అభివృద్ధి కార్యక్రమాలు స్తందించి పోవడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేసి అదికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాలన్నీ నీటిమూటలయ్యాయన్నారు. రాష్ట్రంలో ఎవరిని మాట్లాడించిన కదిలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారన్నారు.
ప్రస్తుతం పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకుల కంటే కాంగ్రెసును గద్దె దించాలని ప్రజలే ఉత్సాహం చూపుతున్నారన్నారు. నమ్మి మోసపోయామని ప్రజలు గుర్తించారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన సొసైటీల వద్ద చెప్పులు, పాసు బుక్కులు లైన్లో పెట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. యూరియా కోసల రైతులు విసిగి వేసారి మహుబూబా బాద్ గ్రోమోర్ షాప్‌కు నిప్పంటించారని గుర్తుచేశారు .రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. ఎన్నికల సమయంలో రైతు భరోసా ఈ నెల తీసుకుంటే రూ. 10వేలు మాత్రమేనని, వచ్చే నెల కాంగ్రెస్ అదికారంలోకి రాగానే తీసుకుంటే రూ. 15వేలు అని చెప్పినవారు ఎక్కడికి పోయాయని దుయ్యబట్టారు.
ఇంట్లో అత్తకు. కొడలుకు రూ.2500ల చొప్పున పెన్షన్ ఇస్తామని చెప్పిన మోసగాళ్లు ఎక్కడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 18లక్షల మంది లబ్దిదారులు ఉన్నారని. పెంచి ఇస్తా మని చెప్పిన పింఛన్ ఇంతవరకు దిక్కు లేదన్నారు. అభివృద్ధి విషయంలో పూర్తిగా కుంటుపడిపోయిందన్నారు. కేసీర్ ప్రభుత్వ హయాంలో సాగునీటి కొరత లేదని, సమయానికి ఎరువులు, రైతుభరోసా అందించామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో ఏ మంత్రికి సోయిదేదన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలని తెలుసుకోవాలన్నారు. యూరియా కొరతలేదని పదేపదే అంటున్నారన్నారు.
మార్చు కోరి ప్రజలు ఓట్లు వేస్తే రాష్ట్రం మరో 15ఏళ్ల వరకు కోలుకునేపరిస్థితి లేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు సుజాత, మాజీ సర్పంచ్ నుమలత, నాయకులు కమలాకర్ రావ్, రహమాన్ తరులున్నారు.