హుజూరాబాద్/హుజూరాబాద్ టౌన్, జూన్ 19 : హరితహారం కార్యక్రమం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం హరితోత్సవం నిర్వహించారు. బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొకలు నాటే కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌తో కలిసి విప్ ముఖ్యఅతిథిగా హా జరయ్యారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడు తూ.. తొమ్మిదేండ్లలో రికార్డుస్థాయిలో 273 కోట్ల మొకలు నాటిన ఘనత సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికే దకుతుందన్నారు. హరితహారంతో రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని గుర్తు చేశారు. నూతన పంచాయతీరాజ్, ము న్సిపల్ చట్టాలతో పచ్చదనం అభివృద్ధికి 10 శా తం గ్రీన్ బడ్జెట్ కేటాయించి మొకలు పెంచుతు న్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు.
ప్రతి గ్రామంలో నర్సరీతో పాటు పల్లె ప్రకృతి వనం, బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పా టు, పట్టణాల్లో 179 చోట్ల అర్బన్ పారులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హరితహారంతో ఫ్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా రెండుసార్లు గుర్తింపు పొంది న హైదరాబాద్ నగరాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి పట్టణం హరిత సిటీగా మారాలని పేర్కొన్నా రు. ప్రతి ఒకరూ హరితహారంలో భాగస్వాము లై, విరివిగా మొకలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్ పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కమిషనర్ సల్వాది సమ్మయ్య, కౌన్సిలర్లు కే రమాదేవి, ఎం సుశీల, కే లావణ్య, టీ శ్రీనివాస్, టీ రాజేంద్రప్రసాద్, ఎం కుమార్‌యాదవ్, వీ యాదగిరి నాయక్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నిర్మల, డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రి న్సిపాల్ పరమేశ్, అధ్యాపకులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు ఈ సురేందర్‌రెడ్డి, టీ శివ, భిక్షపతి, బాలికల ఉన్న త పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆసియా, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, మున్సిపల్ ఏఈ సాంబరాజు, హెల్త్ అసిస్టెంట్ కిషన్‌రావు, శానిటరీ జవాన్లు, సీఎల్ఆర్పీలు, ఆర్పీలు పాల్గొన్నారు.