Formation Day | చిగురుమామిడి, జూన్ 2: తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ జెండా ఎగరవేసి అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ ముద్ధసాని రమేష్, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో భాషం మధుసూదన్, ఎంఆర్సి కార్యాలయం వద్ద ఎంఈఓ పావని, రైతు వేదిక వద్ద మండల వ్యవసాయ అధికారి రాజుల నాయుడు, సహకార సంఘం కార్యాలయం వద్ద సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ మండల ఆరోగ్య కేంద్రం వద్ద మండల వైద్యాధికారిని ఏంజెల్ ప్రీసిల్లా, ఉదయలక్ష్మి మండల సమాఖ్య కార్యాలయం వద్ద సెర్ప్ ఏపీఎం సంపత్, పోలీస్ స్టేషన్లో ఎస్సై సందబోయిన శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయం వద్ద మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, ఇందుర్తిలో మండల ప్రత్యేక ప్రత్యేక అధికారి ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి, గాగిరెడ్డిపల్లి లో మండల ప్రత్యేక అధికారి ఖాజా మోహన్ రెడ్డి, రేకొండలో జిల్లా పంచాయతీ కార్యదర్శి సంఘం అధ్యక్షుడు అజయ్ కుమార్, వివిధ గ్రామాలలో మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాని ఎగరవేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పెనుకుల తిరుపతి, ఎండి సర్వర్ పాషా, కొమ్మర మహేందర్రెడ్డి, మహంకాళి కొమరయ్య,ముక్కెర సదానందం, బెజ్జంకి లక్ష్మణ్, ఆకవరం శివప్రసాద్, బుర్ర తిరుపతి, బిల్ల వెంకట్ రెడ్డి, దుడ్డేల లక్ష్మీనారాయణ, సిపిఐ నాయకులు అందే స్వామి, బూడిద సదాశివ, అందే చిన్నస్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ తాడ స్వరూప రాణి, ఆర్ఐ అరుణ్ కుమార్, తారా దేవి, స్వరూప రాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.