‘కాళేశ్వరం’ అద్భుతం
తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత కట్టడమనిని, ఇది ఇంజినీర్ల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, 15 మంది హైకోర్టు న్యాయమూర్తులు ప్రశంసించారు.
- ఇంజినీర్ల పనితీరుకు ఈ ప్రాజెక్టు నిదర్శనం
- హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్
- 15 మంది జడ్జిలతో కలిసి నంది పంప్‌హౌస్ సందర్శన
ధర్మారం, ఫిబ్రవరి 5: తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత కట్టడమనిని, ఇది ఇంజినీర్ల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, 15 మంది హైకోర్టు న్యాయమూర్తులు ప్రశంసించారు. అనతికాలంలోనే ప్రాజెక్టును ని ర్మించి సాగుకు నీరందించడం అభినందనీయమన్నారు. ఆదివారం ధర్మారం మండలం నంది మే డారంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ప్రారంభోత్సవం అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు నవీన్‌రావు, శ్రవణ్‌కుమార్, టీ వినోద్ కుమార్, ఏ అభిషేక్ రెడ్డి, కే కైలాశ్మన్, బీ విజయ్‌సేన్ రెడ్డి, ఎం.లక్ష్మణ్, కే సురేందర్, ఎం సుధీర్ కుమార్, సీవీ భాస్కర్ రెడ్డి, ఈవీ వేణుగోపాల్, నాగేష్ భీమపాక, పుల్ల కార్తీక్, కే శరత్, జే శ్రీనివాస్‌రావుతో కలిసి గ్రామంలోని నంది పంప్ హౌస్‌ను సందర్శించారు. వారికి రామగుండం నీటి పారుదల శాఖ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూ నె శ్రీధర్, డీఈఈ గునిగంటి నర్సింగారావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారంతా కలిసి పంప్‌హౌస్‌లోని అండర్ టన్నెల్‌లోని సర్జ్‌పూల్, జీఐఎస్ సబ్ స్టేషన్‌ను, మోటర్లను పరిశీలించారు.
నిర్మాణాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. మోటర్ల పనితీరు, టన్నెల్ నిర్మాణం గురించి వారికి ఈఎన్సీ వెంకటేశ్వర్లు వివరించారు. మూడేళ్లలోనే కాళేశ్వరం నిర్మాణం పూర్తయిందని వివరించగా, ఇది ఇంజినీర్ల పనితీరుకు నిదర్శమని జడ్జిలు ప్రశంసించారు. ఈ సం దర్భంగా ప్రత్యేకంగా పంప్‌హౌస్‌లోని 2 మోటర్లను ఆన్ చేయగా, ఆరు బయటకు వచ్చి డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా ఎగిసిపడ్డ జలాలను చూసి ఉజ్జల్ భుయాన్, న్యాయమూర్తులు అబ్బురపడ్డారు. వా రివెంట పెద్దపల్లి జిల్లా చీఫ్ జస్టిస్ ఎం నాగరాజు, సీనియర్ సివిల్ జడ్జి ఎం అర్జున్, కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం సీపీ రెమా రాజేశ్వరి, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాయిపాటి సురేశ్‌బాబు, లక్ష్మణ్‌రావు ఉన్నారు. అంతకుముందు పెద్దపల్లి కోర్టు చీఫ్ జస్టిస్ ఎం నాగరా జు, సీనియర్ సివిల్ జడ్జి ఎం అర్జున్, కలెక్టర్, సీ పీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చీఫ్ జస్టిస్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అద్దె భవనంలో ఏర్పాటు చేసిన కోర్టు శిలా ఫలకాన్ని, జడ్జి చాంబర్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హా జరు కాగా, సుల్తానాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక అతిథులకు ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా జిల్లా చీఫ్ జస్టిస్ నాగరాజ అధ్యక్షత వహించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

