కరీంనగర్ రూరల్, మార్చి 28: వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు, నైతికతపై వైద్యులు దృష్టిసారించాలని తెలంగాణ మెడికల్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వీ రాజలింగం సూచించారు. నగునూర్‌లోని ప్రతిమ వైద్య కళాశాలలో శనివారం ‘ప్రాణా-2026 అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్’ నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వైద్య విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థులు ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వైద్య అధ్యాపకులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా ప్రయోజనాత్మక, పరిశోధనత్మాకంగా విద్యనందించాలని సూచించారు.
వైద్య వృత్తిలో టెక్నాలజీ, కమ్యూనికేషన్, పేషెంట్ సెంట్రిక్ దృక్పథం ముఖ్యమన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులు వృత్తి నైతికతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కొదురుపాక గ్రామంలో వైద్య శిబిరం ద్వారా ప్రతిమ వైద్యులు అందించిన సేవలను అభినందించారు. ఇక్కడ వైద్య కళాశాల డైరెక్టర్లు డాక్టర్ బోయినిపల్లి హరిణి, డాక్టర్ బోయినిపల్లి హసిని, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జాన్ ఇజ్రాయెల్, సీఏవో రాంచందర్‌రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సీఎస్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిషన్‌రెడ్డి, రిజిస్ట్ కమ్ అడ్మిన్ ప్రసాద్‌రావు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ సీహెచ్ అమిత్‌కుమార్, (పీడీయాట్రిక్స్ హెచ్‌వోడీ) డాక్టర్ ప్రణయ్, డాక్టర్ సంధ్యా, సీనియర్ డాక్టర్ సీహెచ్ జగన్మోహన్రావు, తదితరులు ఉన్నారు.