Open cost | గోదావరిఖని : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని జీడికే 5 ఓపెన్ కాస్ట్ గనిలో సోమవారం సాయంత్రం ట్యాంకర్ బోల్తా పడిన ప్రమాదంలో కాంట్రాక్ట్ సూపర్వైజర్ వికాస్ కుమార్ (35) మృతి చెందాడు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో ప్రైవేట్ ఓబి పనులు నిర్వహిస్తున్న పీసీ పటేల్ కంపెనీలో పార్కింగ్ సూపర్వైజర్ గా పని చేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన వికాస్ కుమార్ సోమవారం సాయంత్రం హాలేజే రోడ్లో ప్రైవేట్ ట్యాంకర్ నడుపుతూ అదుపుతప్పి కిందకు దూకాడు. ఈ క్రమంలో ట్యాంకర్ వెనకవైపు టైరు అతని పైనుండి వెళ్లడంతో వికాస్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం కు గల కారణాలను ప్రైవేటు ఓబి కంపెనీ వెల్లడించడం లేదు.