Konduri Ravindar Rao | సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 27: రెండు దశాబ్దాలుగా వ్యవసాయ సహకారం సంఘాలకు ఎనలేని సేవలందించి, సహకార సంఘాలకు వన్నె తెచ్చిన కొండూరి రవీందర్ రావు సహకార సంఘాల లెజెండ్ అని తంగళ్లపల్లి మండల మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు కొనియాడారు. సహకార సంఘాల బలోపేతానికి, రైతులకు ఎన్నో సేవలందించిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు.
ఈమేరకు శనివారం కరీంనగర్లో జరిగిన ఆత్మీయ సన్మానోత్సవానికి తంగళ్లపల్లి మండలంలోంచి భారీగా నేతలు తరలివెళ్లారు. ఈసందర్భంగా కొండూరిరవీందర్ రావును శాలువాలను కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. వీరిలో సింగిల్‌విండో మాజీ చైర్మన్లు ఉమ్మారెడ్డి సత్యనారాయణరెడ్డి, పబ్బతి విజయేందర్‌రెడ్డి, బండి దేవదాస్ గౌడ్, కోడూరి భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజుయాదవ్, జిల్లా సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు, మండలాధ్యక్షుడు వలకొండ వేణుగోపాలరావు, సిలువేరి నర్సయ్య, శ్యాగ దేవేందర్, సిలువేరి చిరంజీవి, గుండుప్రేమకుమార్, సతీష్‌రెడ్డి, మోతే మహేష్, గోట్ల ఐలయ్య యాదవ్, ఏల్లయ్యయాదవ్, గొడిసెల ఎల్లయ్య, బియ్యాల కొండల్ రావు, తదితరులు ఉన్నారు.