Peddapally | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 28 : ఉప సర్పంచ్ ల ఫోరం పెద్దపల్లి మండల అధ్యక్షురాలిగా తలారి స్వప్న-సాగర్ (అందుగులపల్లి) రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు ఫోరం కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గౌరవాధ్యక్షుడిగా గుమ్మడి సోని విజయ్ (రాగినేడు), ఉపాధ్యక్షులుగా గున్నాల రాములు (కనగర్తి), కేశవేని అశోక్ యాదవ్ (మూలసాల), గుర్రం శ్రీధర్ (మారేడుగొండ), వంగ అనిల్ (భోజన్నపేట), పాలేటి వెంకటేష్ యాదవ్ (గౌరెడ్డిపేట), ప్రధాన కార్యదర్శులుగా గాజుల ప్రవీణ్ కుమార్ (కాపులపల్లి), కొండ శ్రావణ్ కుమార్ (రంగాపూర్), సిలారపు శ్రీనివాస్ (కొత్తపల్లి), కార్యదర్శులుగా మిట్టపల్లి వెంకటేష్ (పెద్దబొంకూర్) సుద్దాల స్రవంతి వెంకటేష్ (అప్పన్నపేట), బీటి అశోక్ (కుర్మపల్లి), తొగరి రాజేశం (గుర్రాంపల్లి), సంయుక్త కార్యదర్శులుగా పర్స లక్ష్మి-శంకరయ్యయాదవ్ (పెద్దకల్వల), బోయిని ఓదెలు (గోపయ్య పల్లి), కోశాధికారిగా పంబాల రాజు యాదవ్ (బొంపల్లి), సహాయ కార్యదర్శి గా కలవేని అనూష (ముత్తారం), మడుపు జయలక్ష్మి (రాంపల్లి)ని ఎన్నుకున్నారు.