Raghavpur | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 18 : పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ సర్పంచ్ గా తాడిచెట్టి చామంతి శ్రీకాంత్ సగర బీఆర్ఎస్ గెలుపొందారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గ్రామ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. దీంతో గెలిచిన సర్పంచ్ చామంతి-శ్రీకాంత్ సగరను దాసరి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించి, అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశయాలకనుగుణంగా గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేయాలని సూచించారు. రాఘవాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్ సగర, గ్రామ శాఖ అధ్యక్షుడు అంతగిరి కొమురయ్య, కుంట కుమారస్వామి, మాజీ సర్పంచ్ అర్కుటి రామస్వామి యాదవ్, ఎనుగుల మల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.