MLA Dr. Sanjay | కోరుట్ల, జనవరి 12: స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. సోమవారం వివేకానంద జయంతోత్సవాల్లో భాగంగా పట్టణంలోని కల్లూరు రోడ్డు వద్ద గల వివేకానంద విగ్రహనికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శప్రాయుడని, ఆత్మవిశ్వాసం, దేశభక్తి భావనలు కలిగిన గొప్ప దేశభక్తుడని కొనియాడారు.
స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజ అభ్యున్నతికి యువత కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, నాయకులు పాల్గొన్నారు.