Ramagundam | జ్యోతినగర్(రామగుండం), నవంబర్ 10 : రామగుండంలోని ఎన్టీపీసీకి చెందిన పంప్ హౌజ్ వద్ద పనిచేసే కాటం శ్రీనివాసులు(58) అనే ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడు ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. తలపై బలయమై గాయాలతో గుర్తు తెలియని వ్యక్తులు బండారాయితో కొట్టి హత్యచేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామగుండం పోలీసుల కథనం ప్రకారం.. రామగుండంలోని ఇందిరానగర్‌కు చెందిన మృతుడు శ్రీనివాసులు రామగుండం పంప్ హౌజ్‌లో ఎన్టీపీసీకి చెందిన శ్రీరామ సత్యసాయి ఎంటర్ప్రైజెస్ కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నాడు.
ఆదివారం ఉదయం షిఫ్ట్ విధులకు 6గంటలకు హజరై మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఇంటికి వచ్చి అనంతరం తిరిగి రెండో షిప్టు విధులకు హజరయ్యారు. దీంతో భార్య రాజేశ్వరి విధులు నిర్వహిస్తున్న భర్త వద్దకు సాయంత్రం 4గంటల సమయంలో టీ తీసుకువచ్చి వెళ్లిపోయింది. అనంతరం భార్య రాత్రి 9గంటల సమయంలో ఫోన్ చేయగా సెల్‌ఫోన్ స్వీచ్‌ఆఫ్ వచ్చింది. దీంతో భార్య తన కూతురుతో కలిసి పంప్ హౌజ్‌కు చేరుకుంది. అక్కడ భర్త లేడు. రాత్రి షిఫ్ట్ విధులు నిర్వహించే మరోక్క కార్మికుడు ఉన్నాడు. పంప్ హౌజ్ వెనుకాల బలమైన గాయాలతో అనుమానాస్పదంగా ఉన్న శ్రీనివాసులును భార్య గుర్తించింది. ఈ మేరకు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రామగుండం ఎస్‌హెచ్‌వో కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.