Dharmaram | ధర్మారంలో సంచలనం రేపిన వృద్ధురాలి అనుమానాస్పద మరణం
- కుటుంబ సభ్యులచే హడావుడిగా మృతదేహం ఖననం
- ఓ మహిళ ఫిర్యాదుతో కదిలిన పోలీస్ శాఖ
- ఖననం చేసిన ప్రదేశాన్ని సందర్శించిన పెద్దపల్లి సీఐ
- పూడ్చి పెట్టిన ప్రదేశం నుంచి మృతదేహం వెలికితీత
- ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చే పోస్టుమార్టం.. తహసీల్దార్ సమక్షంలో పంచనామా
Dharmaram | ధర్మారం,అక్టోబర్ 11: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గంగాధర లక్ష్మి (61) అనే మహిళ అనుమానాస్పద మరణం సంచలనం రేపింది. వృద్ధురాలి మృతదేహానికి మరణించిన తెల్లవారు కోడలు ,కొడుకు హడావుడిగా అంత్యక్రియ చేయడం ఎన్నో అనుమానాలకు దారితీసింది. లక్ష్మీ మరణంపై అనుమానం ఉందని ఆ వీధిలో నివాసం ఉంటున్న సింగిరెడ్డి సరోజన అనే మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు పై పోలీస్ శాఖ స్పందించి దర్యాప్తు ప్రారంభించింది. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు. ఈ సంఘటనపై పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, స్థానికుల కథనం ప్రకారం.. గంగాధర లక్ష్మికి కొడుకు వెంకటేష్, కోడలు పుష్పలత ఉన్నారు. గత కొన్ని ఏళ్ల నుంచి అత్త లక్ష్మిని కోడలు పుష్పలత వేధిస్తూ వచ్చింది. కోడలు వేధింపులకు కొడుకు కూడా తోడయ్యాడు. దీంతో కోడలు, కొడుకు వేధింపులు భరించలేక గత ఐదేళ్ల క్రితం సింగిరెడ్డి సరోజన ఇంటిలో లక్ష్మి ఒక ఏడాది పాటు కిరాయికి ఉంది.
ఆ తర్వాత లక్ష్మి తన మనవలను చూడాలని ఉద్దేశంతో సరోజన ఇంటి నుంచి ఖాళీ చేసి అదే వీధిలో ఉంటున్న తన సొంత ఇంటికి లక్ష్మీ వెళ్లింది. అయినప్పటికీ కోడలు నుంచి వేధింపులు కొనసాగినప్పటికీ వాటిని భరిస్తూనే కూలీనాలి చేసుకుంటూ లక్ష్మి తన జీవితాన్ని గడుపుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈనెల 9న రాత్రి లక్ష్మికి కోడలికి మధ్య గొడవ జరగడంతో ఆ వీధిలో ఉన్న వారు గమనించారు. దీంతో శనివారం తెల్లవారేసరికి లక్ష్మీ ఆమె ఇంటిలో మరణించి ఉండటంతో ఆమె మృతిపై చుట్టుపక్కల వారికి ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. లక్ష్మి మృతదేహాన్ని చూడడానికి కూడా చుట్టుపక్కల వారిని ఆమె కోడలు కొడుకు ఇంటిలోకి అనుమతించకపోవడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తాయి. హడావుడిగా లక్ష్మీ మృతదేహానికి ఆమె కొడుకు, కోడలు కలిసి గ్రామ శివారులో అంత్యక్రియలు జరిపి ఖననం చేశారు. దీంతో ఇదివరకు లక్ష్మి కిరాయి ఉన్న ఇంటి యజమాని సరోజన కు లక్ష్మీ మృతి పై అనుమానం వచ్చింది. లక్ష్మి మరణం పై అనుమానాస్పదంగా ఉందని శనివారం రాత్రి సరోజన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు అందుకున్న ఎస్సై ఈ శ్రీకాంత్ ఆ వీధికి వెళ్లి లక్ష్మీ మృతి పై ఆరా తీసి అనుమానాస్పద కేసును నమోదు చేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న పెద్దపల్లి సీఐ కే ప్రవీణ్ కుమార్ ఆదివారం రంగంలోకి దిగారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్ తో కలిసి లక్ష్మీ మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. దీంతో సంఘటన స్థలానికి సీఐ ఇచ్చిన సమాచారంతో రామగుండం మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ కార్తీక్ పూడ్చి పెట్టిన స్థలానికి చేరుకున్నారు. లక్ష్మీ మృతదేహాన్ని బయటకి తీయించి స్థానిక తహసీల్దార్ డీ శ్రీనివాస్ సమక్షంలో అక్కడికక్కడే పోస్టు మార్టం చేశారు. అనంతరం శవాన్ని తిరిగి అదే ప్రదేశంలో పూడ్చి పెట్టించారు. ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ లక్ష్మి అనుమానాస్పద మృతిపై పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

