Housing Board | జ్యోతినగర్, జూన్ 17: రామగుండం మండల కేంద్రంలోని హౌజింగ్‌బోర్డుకాలనీలో నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు కోసం క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు రామకుమార్, వెంకటేశ్వర్లు, గౌస్, శ్రీలత సర్వే చేపట్టారు. హౌసింగ్ బోర్డు కాలనీ పిల్లలు పాఠశాలకు వెళ్లుటకు కిలోమీటరు వరకు ఆటోలో చార్జీలతో ప్రయాణిస్తున్నట్లు స్థానిక మహిళ బీ లక్ష్మీ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణి ద్వారా విన్నపించారు.
స్పందించిన అధికారులు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కోసం అక్కడ పరిస్థితులు 1-5 తరగతుల వరకు విద్యార్థుల సంఖ్యపై మండల, జిల్లా విద్యాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు సర్వే చేపట్టి నిర్వహించారు. హౌజింగ్‌బోర్డు కాలనీలో లేబర్ కుటుంబాలకు చెందిన దాదాపు 120 మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వీరు ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు వెళ్తున్నట్లు సర్వే నివేధికను మంగళవారం మండల విద్యాధికారి కార్యాలయంకు సర్వే నివేదికను అందజేసినట్లు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు పేర్కొన్నారు.