Support Price | కొనుగోలు కేంద్రాల్లోనే వరికి మద్దతు ధర.. కమాన్‌పూర్ ఏఎంసీ చైర్మన్ రాజు
రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర (MSP) కొనుగోలు కేంద్రాల ద్వారానే లభిస్తుందని కమాన్‌పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు తెలిపారు.
Support Price | రామగిరి, ఏప్రిల్ 24 : రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర (MSP) కొనుగోలు కేంద్రాల ద్వారానే లభిస్తుందని కమాన్‌పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు తెలిపారు. రత్నపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కనీస మద్దతు ధరను అమలు చేస్తున్నదని, అందువల్ల రైతులు నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం, నాణ్యత పరీక్షలు పారదర్శకంగా నిర్వహించబడతాయని, రైతులకు చెల్లింపులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తిన పక్షంలో స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. రైతులు తమ పంటను సకాలంలో తీసుకువచ్చి విక్రయించుకోవాలని, కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

