ACB Raid | తిమ్మాపూర్ మార్చ్ 16: అవినీతి ఆరోపణలు అక్రమ ఆస్తుల ఫిర్యాదులతో విచారించిన ఏసీబి అధికారులు అధికారిపై కొద్ది రోజులుగా విచారించి అరెస్టు చేశారు. తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల జాయింట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మధుసూదన్ రెండేళ్ల కింద ఉద్యోగుల ఫైల్స్ క్లియర్ చేయడానికి, కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేయడానికి ముడుపులు తీసుకునేవాడు. ఈ క్రమంలో నేరుగా తీసుకుంటే ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో తన స్నేహితుడి పేరు మీద ఓ ప్రైవేట్ బ్యాంకులో అకౌంట్ తీసి అతడి అకౌంటుకు జమ చేయించేవాడు.
స్నేహితుడితో గొడవ..
ఈ క్రమంలో అంతా సాఫీగా సాగిపోతుండగా ఇటీవల తన స్నేహితుడికి విబేధాలు వచ్చాయి. దీంతో ఆయన తన అవినీతి చిట్టా బయటపెట్టాడు. అతడి అవినీతి నగదు తనకు బదిలీ చేయించేవాడని ఆధారాలతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పలుమార్లు విచారించిన ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం ఆయనను కార్యాలయంలో అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.