Suicide | ఓదెల, ఆగస్టు 15 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన ఐలు రాజు గౌడ్(41) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. రైల్వే పోలీస్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజు గౌడ్ తన కులవృత్తి అయిన కలాలితోపాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్టు కుటుంబీకులు తెలిపారు. తన వ్యవసాయ భూముల సమీపంలో రైల్వే ట్రాక్ ఉండగా అక్కడ రైలు కిందపడి శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.