పెద్దపల్లి, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): అం ధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా దేశంలో ఎక్క డా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయిస్తున్నా రు. కంటి వెలుగు పేరుతో 2018 ఆగస్టు 15వ తొలిసారి ప్రారంభించిన కార్యక్రమం లక్షలాది మందికి కంటిచూపును ప్రసాదించింది. కాస్త విరామం తర్వాత రెండో విడుత జనవరి 19న ప్రారంభమైన కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతున్నది. రూపాయి ఖర్చు లేకుండా ఊరూరా శిబిరాలు నిర్వహించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శిబిరాలకు యువతీ, యువకుల నుంచి వృద్ధుల దాకా అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. పెద్దపల్లి జిల్లాలో గత నెల 19 నుంచి ఇప్పటివరకు 1,05,338మంది ప్రజలకు 34 వైద్య బృం దాలతో కంటి పరీక్షలు నిర్వహించి 17,537 మంది ప్రజలకు రీడింగ్ గ్లాసులు అందజేశారు. అలాగే 14,495మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఆర్డర్ ఇచ్చి ఇప్పటి వరకు 413మందికి ఏఎన్ఎంల ద్వారా పంపిణీ పూర్తి చేయగా, మిగిలిన వారికి పంపిణీ కొనసాగుతున్నది. సర్కార్ చేపట్టిన కంటి వెలుగులు కార్యక్రమంపై జిల్లాలోని ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్యాంపులపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవం తం చేసేందుకు కలెక్టర్ సంగీత సత్యనారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు. జిల్లాలో 34 వైద్య బృందాలతో క్యాంపులను నడిపిస్తున్నారు. క్యాం పుల వద్ద ప్రజలు వేచి చూడాల్సిన అవసరం లే కుండా పంచాయతీ కార్యదర్శులు, అంగన్ వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, రేషన్ డీలర్లు ప్రజల వద్దకే వెళ్లి క్యాంపులకు రావాల్సిన సమయాన్ని సూచిస్తూ ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నా రు. రాష్ట్ర అధికారుల సూచనల మేరకు జిల్లాలో ఉన్న బఫర్ బృందాలతో ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పోలీసులు, న్యాయవాదులు, వివిధ వర్గాల వారికి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేస్తున్నారు.
వెలుగు చూపిన దేవుడు కేసీఆర్
కేసీఆర్ సారు ప్రవేశపెట్టిన కంటి వెలుగుతో పేద కుటుంబాలపై భారం తగ్గింది. కంటి పరీక్షల కోసం ప్రైవేట్ దవాఖానలకు పోతే వేలాది రూపాయలు ఖర్చవుతుండే. అలాంటిది సీఎం కేసీఆర్ పెట్టిన ఈ పథకంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడ మంచిగచూస్తున్రు. నాకు చూపు మసగ్గా ఉన్నది. పరీక్షలు చేపిచ్చుకున్న. దగ్గర చూ పు తగ్గిందని ఒక పైసా ఖర్సు లేకుంట ఉచితంగా కండ్లద్దాలు, మందులు ఇచ్చిన్రు.
–కలషికం అనిత, సుల్తానాబాద్