Gangadhara | గంగాధర, జూలై 14 : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని భవిష్యత్ లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని బీజేపీ చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పెరుక శ్రావణ్ అన్నారు. తన తండ్రి బీజేపీ నాయకుడు పెరుక మల్లారెడ్డి జ్ఞాపకార్థం సోమవారం గర్శకుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ట్రాక్ షూ, యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి మల్లారెడ్డి సమాజ సేవ చేస్తూ ప్రజల్లో గొప్ప వ్యక్తిగా నిలిచారని కొనియాడారు.
ఆయనను ఆదర్శంగా తీసుకొని తనకు తోచిన విధంగా సమాజ సేవ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గర్శకుర్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్రాక్ షూ లు, యూనిఫామ్ అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. యూనిఫామ్ అందజేసిన శ్రవణ్ కు విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, నాయకులు చిందం ఆంజనేయులు, కోల అశోక్, దయ్యాల ప్రణయ్, తూము కరుణాకర్, తిరుపతి, శ్రీకాంత్, శ్రీనివాస్, ఉపాధ్యాయుడు శ్యాం కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.