ఓదెల, జూలై 29 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల విద్యా వనరుల కేంద్రంలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యార్థుల యుడైస్ నమోదు, ఎఫ్ఆర్ఎస్ ఇతర ఆన్లైన్ ఆక్టివిటీస్, ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ పైన చర్చించారు. అలాగే పాఠశాలల విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు ఇచ్చారు. పాఠశాలల్లో పని చేస్తున్న స్కావెంజర్లకు జీతాలు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై సమీక్ష జరిపారు. పాఠశాలల్లో నిర్వహించవలసిన రికార్డులు రిజిస్టర్లు, ఏఏపీసీలో భాగంగా పాఠశాల వసతులు మెరుగుపరుచుకోవాలని సూచనలు చేశారు. ఈ సమావేశం ఎంఈఓ రమేష్ అధ్యక్షతన జరగగా, పోత్కాపల్లి, ఓదెల కాంప్లెక్స్ హెచ్ఎంలు సాంబయ్య, లక్ష్మీనారాయణ, సీఆర్పీలు, ఎంఆర్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.