కరీంనగర్ కమాన్చౌరస్తా, ఏప్రిల్ 12 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మారులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లి కేంద్ర కార్యాలయంలో విద్యార్థులను అభినందించి, వివరాలు వెల్లడించారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో కే పల్లవి 996, జీ హైంధవి 996, డీ ప్రణవి 996, వై శ్రీనిత్య 996 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచారని చెప్పారు. 15 మంది విద్యార్థులు 995 ఆపై మారులు, 202 మంది విద్యార్థులు 990 ఆపైన మారులు సాధించారని తెలిపారు.
అలాగే, సీనియర్ ఇంటర్ బైపీసీలో ఆర్ వైష్ణవి 995, కే హారిక 995, నభిలాతాహేన్ 995, ఎస్ బ్రహ్మాణి 995, ఎస్ ఐశ్వర్య 995 మారులు సాధించి అగ్రగామిగా నిలిచారని వివరించారు. 38 మంది విద్యార్థులు 990 ఆపై మారులు సాధించినట్లు చెప్పారు. అలాగే, ఎంఈసీలో కే మానస 988, సీఈసీలో పీ బావోజ్ఞ 987 మారులు సాధించగా, 970 ఆపై మారులు 18 మంది విద్యార్థులు సాధించినట్లు చెప్పారు. అలాగే, మొదటి సంవత్సరంలో ఎంపీసీలో డీ వినీష 469, జీ అక్షర 469 మారులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. 61 మంది విద్యార్థులు 468 ఆపై మారులు, 176 మంది విద్యార్థులు 467 ఆపై మారులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని దశదిశలా చాటారని చెప్పారు. బైపీసీలో ఎస్ జాగృతి 439, ఏ హస్విత 439, ఖాన్సా అలియా 439, జీ కావ్యశ్రీ 439, మారులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు.
అలాగే, 20 మంది విద్యార్థులు 438 ఆపై మారులు సాధించారని, 46 మంది విద్యార్థులు 437 ఆపై మారులు సాధించారని, 77 మంది విద్యార్థులు 436 ఆపై మారులు సాధించారని తెలిపారు. ఎంఈసీలో ఎం మహాలక్ష్మి 493, సీఈసీలో వీ దీక్షిత 494, అనామ్మహ్రూజ్ 494 మారులు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్య ద్వారా సంచలనాత్మక విజయాలను నమోదు చేయవచ్చని, నాణ్యమైన బోధన ద్వారా అద్భుతాలు సృషించవచ్చని, ఇందుకు నేటి ఇంటర్మీడియట్ ఫలితాలే నిదర్శనమని చెప్పారు. రానున్న రోజుల్లో విద్యార్థులు ఐఐటీ, నీట్, ఎప్సెట్ ఫలితాల్లో అఖండ విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.