Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
Police Commissioner | బ్యాంకు అధికారులు, సిబ్బంది పోలీస్ అధికారులతో సమన్వయంతో పనిచేస్తే బ్యాంకులు,ఏటీఎంల వద్ద జరిగే నేరాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
పెద్దపల్లి : బ్యాంకు అధికారులు, సిబ్బంది పోలీస్ అధికారులతో సమన్వయంతో పనిచేస్తే బ్యాంకులు ( Banks ), ఏటీఎం ( ATM ) ల వద్ద జరిగే నేరాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని ( Security measures ) రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ( Amber Kishore Jha ) అన్నారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు,వివిధ బ్యాంకుల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బ్యాంకులు, ఏటీఎంల భద్రతా ప్రమాణాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాల నివారణపై చర్చించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్లో 109 బ్యాంకులు,79 ఏటీఎం కేంద్రాలు, మంచిర్యాల జోన్లో 109 బ్యాంకులు,89 ఏటీఎం కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. ప్రతి బ్యాంకు, ఏటీఎం వద్ద భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
ప్రతి ఏటీఎం కేంద్రంలో 24 గంటలూ సెక్యూరిటీ గార్డు, నాణ్యమైన సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు.దోపిడీ లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది ఎలా స్పందించాలనే అంశంపై బ్యాంకు ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. డీవీఆర్‌లను బహిరంగంగా కనిపించకుండా సురక్షితమైన రహస్య ప్రదేశంలో ఏర్పాటు చేయాలని సూచించారు.
ఏటీఎంలలో నగదు నింపే సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలి తెలిపారు.
ఏదైనా అనుమానాస్పద లేదా ప్రమాదకర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, వివిధ బ్యాంకుల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

