Strict Action | మంథని, నవంబర్ 20: సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వర్గాలు, వ్యక్తులపై తప్పుడు పోస్ట్లు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంథని ఎస్సై డేగ రమేష్ హెచ్చరించారు. మంథని పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని వ్యక్తులు, వర్గాలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారన్నారు.
గొడవలు, ఘర్షణలకు దారి తీసే విధంగా పెడుతున్న ఈ పోస్టులతో శాంతి భద్రతలకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఎవరైనా బాధిస్తే వారిపై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాను ఎవరు కూడా దుర్వినియోగం చేయవద్దని సూచించారు.