control room | కోరుట్ల, జూలై 23: పట్టణంలోని కల్లూరు రోడ్డు విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్ రూమ్ దుస్థితిపై మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘పెచ్చులూడుతున్న పట్టించుకోరా.. భయం గుప్పిట్లో విద్యుత్ ఉద్యోగులు’ శీర్షికన కథనం ప్రచురిచితమైందిన ఈ కథనానికి విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించారు. విద్యుత్ సివిల్ వింగ్ అధికారులు ఆపరేటర్ కంట్రోల్ రూమ్ ను బుధవారం పరిశీలించారు. కంట్రోల్ రూమ్ సేవలను తాత్కలిక భవంతిలో నిర్వహించాలని సూచనలు చేశారు.
నూతన భవన నిర్మాణం కోసం కొలతలు తీసుకున్న సివిల్ వింగ్ అధికారులు అంచనాలను తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. శిధిలావస్థకు చేరుకున్న కంట్రోల్ రూమ్ స్థానంలో నూతన కట్టడాన్ని నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. కాగా ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లిన సమస్తే తెలంగాణ దిన పత్రికకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ విద్యుత్ సివిల్ వింగ్ డిప్యూటీ ఇంజనీరు శ్రీనివాస్, ఏడిఈ అనూప్ కుమార్, ఏఈ సాయి జితేష్, కోరుట్ల విద్యుత్ ఏడీఈ రఘుపతి, పట్టణ ఏఈ శ్యాంకుమార్, విద్యుత్ ఉద్యోగులు ఉన్నారు.