Chinthala Palli | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 23: తంగళ్ళపల్లి మండలం కస్బె క ట్కూర్ పరిధి లోని చింతలపల్లి లో బుధవారం పోచమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ సర్పంచ్ వలకొండ వేణు గోపాల రావు తో పాటు నేతలకు తీర్థ ప్రసాదం అందించి, ఘనంగా సన్మానించారు. ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వలకొండ వేణుగోపాలరావు, మాజీ జడ్పీటిసి కోడి అంతయ్య, మాజీ ఏయంసి డైరెక్టర్ బల్లేపు సిద్దన్న, సాయి, ప్రశాంత్ యాదవ్, లచయ్య, ఆలయ నిర్వాహకులు ఉన్నారు.