Srinu Babu | పెద్దపల్లి, జూన్ 14( నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(TPCC) ప్రధాన కార్యదర్శిగా తనకు అవకాశం ఇచ్చిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మంథని నియోజకవర్గంలో, పెద్దపల్లి జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానన్నారు. తను తనపై నమ్మకంతో తనకు రాష్ట్ర పార్టీలో అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి టీపీసీసీ అధ్యక్షుడికి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.