కార్పొరేషన్, మార్చి 7: ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో కరీంనగర్లో రెండు రోజులపాటు ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు. కోర్టు చౌరస్తాలోని శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపం వేదికగా శనివారం ఉదయం 10 గంటలకు ఈ ఎక్స్పోను ప్రారంభించనున్నారు. శని, ఆదివారాల్లో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 7గంటల వరకు నిర్వహించనున్నారు.
హైదరాబాద్, కరీంనగర్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ సంస్థలు, గృహ నిర్మాణ సంస్థలు, బ్యాంకులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో వెంచర్లు, అపార్ట్మెంట్లు, రెడీమెడ్ ఇండ్లు, విల్లాలు, కల్పిస్తున్న సౌకర్యాలు, ఇండ్ల నిర్మాణాలకు అయ్యే వ్యయం, బ్యాంకు రుణాలు ఇలా అన్ని వివరాలను ప్రతినిధులు అందించనున్నారు. నిర్మాణ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారం ఒకే వేదికగా తెలుసుకునే అవకాశం ఈ ప్రాపర్టీ షో కల్పిస్తుండగా, సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.