Mallapur | మల్లాపూర్లో వైభవంగా ముగిసిన శ్రీ కనక సోమేశ్వరస్వామి శ్రావణమాస ఉత్సవాలు
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ది గాంచిన ప్రాచీన చరిత్ర గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం వద్ద నాలుగవ చివరి శ్రావణమాస సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 7 : మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ది గాంచిన ప్రాచీన చరిత్ర గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం వద్ద నాలుగవ చివరి శ్రావణమాస సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కాలినడకన కొండపైకి ఎక్కి కొండపై గల సహజసిద్దమైన కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో సోమేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన వరదపాశం(బెల్లం అన్నం)ను వండి ఆలయం ఎదుట వరదపాశం పోసి తమ మొక్కులను చెల్లించి అక్కడే సహంపక్తి భోజనాలు చేయడం అనావాయితీ. చివరి శ్రావణమాస సోమవారం సందర్భంగా భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు. భక్తులకు కొండ కింద ఏలేటి జగన్ రెడ్డి- నీల దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదానం చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు బల్యపల్లి ప్రభాకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను చేశారు. ఈ వేడుకల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, అదిలాబాద్ జిల్లాలతో పాటు, మహారాష్ట్ర ప్రాంతాలను నుండి భక్తులు తరలివచ్చారు. ఇక్కడ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు క్యాతం సురేష్ రెడ్డి, కమిటీ సభ్యులు, అధికారులు, అఖిలపక్షం పార్టీల నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

