Veenavanka | వీణవంక, జనవరి 17 : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. జమ్మికుంట మండలంలోని ధర్మారం గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వీణవంక జట్టును సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై ఆవుల తిరుపతి శనివారం అభినందించారు.
జమ్మికుంట మండలం ధర్మారం గ్రామంలో ఈ నెల 10 నుండి రామ్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా ఫైనల్కు చేరుకున్న వీణవంక జట్టు, ధర్మారం జట్టు శనివారం పోటీ పడగా వీణవంక జట్టు విజేతగా నిలిచింది. దీంతో రూ.15 వేల ఫ్రైజ్ మనీతో పాటు ట్రోఫీ అందుకున్నారు. కాగా వీణవంక క్రికెట్ టీంను జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై ఆవుల తిరుపతి, సర్పంచ్ దాసారపు సరోజన-రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ తాళ్లపెల్లి మహేశ్ అభినందించారు.