Special recognition | పెద్దపల్లి రూరల్ మే 17: పెద్దపల్లి మండలం పెద్దకల్వలలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెద్దపల్లి, వీ–హబ్ మధ్య MOU (అవగాహన ఒప్పందం) కుదిరింది. ఈ మేరకు అట్టి ఒప్పంద పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శనివారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.లక్ష్మి నర్సయ్య అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా కళాశాల ప్రతిష్ట పెరిగినట్లుగా చెప్పారు. డిగ్రీ కళాశాలలో చదువుతున్న మహిళా విద్యార్థులకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మహిళా విద్యార్థులు చదువుతోపాటు నూతన ఆవిష్కరణలు చేసే అవకాశం వీ–హబ్ సహకారంతో పొందవచ్చన్నారు. కళాశాలలొ చదువుతున్న ప్రతి మహిళా విద్యార్థి వీ–హబ్ సహకారంతో నూతన ఆలోచనలతో ముందుకు వచ్చి, నైపుణ్యాన్ని పెంపొందించుకొని కొత్త అంకుర సంస్థలు ఏర్పాటు చేయాలని అందుకు ప్రిన్సిపల్ గా నా యొక్క సహకారం ఉంటుందని అభయమిచ్చారు. ఈ ఒప్పందం కుదరడంలో కళాశాల అధ్యాపకుల సహకారం మరువలేనిదిగా చెప్పారు. ఒప్పందం కుదిరినందుకు ప్రిన్సిపల్, అధ్యాపకులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నైపుణ్య లేమితో మహిళలు వ్యాపారాభివృద్ధిలో సవాళ్లు ఎదుర్కొంటున్నారు.
మహిళా సాధికారతే లక్ష్యంగా అంకుర(స్టార్టప్) పరిశ్రమలు ఏర్పాటు చేయించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ”వీ-హబ్ ” అండగా నిలుస్తోందన్నారు. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం వ్యాపార రంగంలో అతివలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా నైపుణ్యం పెంచడం, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా గత ప్రభుత్వం 2018లో ”వీ-హబ్ (వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ -హబ్)”ను ఏర్పాటు చేసింది. డిగ్రీ, పీజీ విద్యార్థి నులకు కెరీర్ గైడెన్స్ ఇవ్వడం, అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేయించడం, సంఘాలు మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిది ద్దడమే లక్ష్యంగా సంస్థ పని చేస్తోందన్నారు. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోందన్నారు.
వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం • స్వశక్తి సంఘాల సభ్యులు, సభ్యత్వం లేని మహిళలు. 17 నుంచి 23 ఏళ్లలోపు యువతులకు ఆర్ధిక చేయూతనందించడం. మహిళల వ్యాపారాభివృద్ధికి అవసరమైన నైపుణ్యం పెంచడం, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం, ఇప్పటికే ఏర్పాటు చేసుకుంటే బలోపేతం చేయడం, డిగ్రీ, పీజీ విద్యార్థినులకు భవిష్యత్తుపై మార్గ నిర్దేశనం చేయడం జరుగుతుందన్నారు. వినూత్న రంగాల్లో పరిశ్రమల స్థాపనలకు ఆలోచనలను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు