Special portal | పెద్దపల్లి, నవంబర్7: కోర్టు కేసుల ట్రాకింగ్‌కు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేశామని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష వెల్లడించారు. కలెక్టరేట్లో కోర్టు కేసుల ట్రాకింగ్‌పై జిల్లా అధికారులు, తహసీల్దార్లకు శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కోర్టు కేసుల ట్రాకింగ్ కోసం పోర్టల్ తయారు చేశామని తెలిపారు.
ప్రతీ జిల్లా అధికారి పేరిట లాగిన్ తయారు చేసి కోర్టు కేసులు రెగ్యులర్ ఫాలో అప్ చేయవచ్చునన్నారు. సోమవారం నుంచి ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని, కోర్టు కేసుల సంబంధించిన సంపూర్ణ వివరాలు ఈ పోర్టల్ లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు బీ గంగయ్య, కే సురేష్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.