జ్యోతిష్మతి విద్యాసంస్థల అధినేతగా జువ్వాడి సాగర్రావు ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణలోనే సుపరిచితులు. చందుర్తి మం డలం మూడపల్లికి చెందిన ఆయనకు బా ల్యం నుంచే పుట్టిన ఊరంటే ప్రత్యేక అభిమా నం. తల్లిదండ్రులు జువ్వాడి నారాయణరావు-మంగమ్మ నాలుగో సంతానమే సాగర్రా వు. స్వగ్రామంలోని ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన, కరీంనగర్, హైదరాబాద్లో ఉన్నత విద్యనభ్యసించారు. కొలువులు ఎన్ని వరించినా కాదని, జ్యోతిష్మతి విద్యాసంస్థలను నెలకొల్పి, విశేష ప్రాచుర్యం పొందారు.
ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన ఊరును మాత్రం మరిచిపోలేదు. ఈ క్రమంలో గ్రామంలో తాను చదువుకున్న పాఠశాలలో క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మౌలిక వసతులు కల్పిస్తున్నా రు. ఇప్పటికే విద్యార్థుల కోసం 3లక్షలతో 100డెస్ టేబుళ్లను అందజేశారు. ఇదిలా ఉండగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏటా నగదు సాయం చేస్తున్నారు. గ్రామం లో కొన్నేళ్లుగా తాగునీటి సమస్య ఉంది. ఈ క్రమంలో సాగర్రావు పదేళ్ల క్రితం తల్లిదండ్రులు నారాయణరావు-మంగమ్మల జ్ఞాపకార్థం 4లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడమే కాదు నిర్వహణ ఖర్చులు కూడా భరిస్తున్నారు. గ్రామ జనాభా 2500 ఉండగా, సదరు ప్లాంట్ సరిపోకపోవడంతో ఇటీవలే హరిజనవాడలో 4లక్షల వ్యయంతో సోదరుడు ఆనందరా వు జ్ఞాపకార్థం మరో మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.
పుట్టిన ఊరికి ఎంత సేవ చేసినా తకువే. గ్రామంలో మౌలిక వసతులు, భావి పౌరులకు మంచి విద్య అందాలి. ఈ క్రమంలో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషిచేస్తున్నా. సహాయ సహకారాలు అందిస్తున్న.
– జువ్వాడి సాగర్రావు, జ్యోతిష్మతి విద్యాసంస్థల చైర్మన్