Jagityal | పెంబట్లకోనాపూర్లో తల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు, కోడలు
సారంగపూర్ మండలం పెంబెట్ల కొనాపూర్ గ్రామానికి చెందిన గడుప బక్కవ్వ( 81)అనే వృద్ధురాలిని తన కన్న కొడుకు లింగారెడ్డి, కోడలు లక్ష్మి ఇంట్లోంచి గెంటి వేశారు. కాగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్‌ను ఆశ్రయించారు.
Jagityal | జగిత్యాల జూన్ 6 : సారంగపూర్ మండలం పెంబెట్ల కొనాపూర్ గ్రామానికి చెందిన గడుప బక్కవ్వ( 81)అనే వృద్ధురాలిని తన కన్న కొడుకు లింగారెడ్డి, కోడలు లక్ష్మి ఇంట్లోంచి గెంటి వేశారు. కాగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆ వృద్ధ తల్లి హరి అశోక్ కుమార్ సాయం తో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. కాగా తల్లి దండ్రుల పోషణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
అనంతరం ఆ వృద్ధ తల్లి సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో విలేకరులకు తన గోడు వినిపిస్తూ రోదించారు. తన కొడుకు లింగా రెడ్డి, కోడలు లక్ష్మి వికలాంగురాలి నైన నన్ను కొట్టి ఇంట్లోంచి గెంటి వేయగా బయటనే ఉండి అడుక్కొని తింటూ, బయటనే పడుకుంటూ పలు ఇబ్బందులు పడుతున్నానని, సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించారు. కాగా తన కొడుక్కి ఫోన్ చేసినా ఎత్తకపోతే ఒక రోజు తన ఇంటిలో భోజన, వసతి కల్పించి, ఆర్డీవోకు ఫిర్యాదు చేయించారు.
కాగా కేసు నమోదు చేశారని, తనను ఇంట్లోంచి కొట్టి గేంటేసిన కొడుకు, కోడలిపై తగు చర్యలు తీసుకుని, తన ఇంటిలో తనను ఉంచేలా కొడుకు, కోడలు తన సంరక్షణ, పోషణ చూసుకునేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవోను కోరారు. వృద్ధురాలి వెంట సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, వృద్ధుల సంరక్షణ కాన్సిలియేషన్ అధికారి పీసీ హన్మంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బొల్లం విజయ్, వెల్ముల ప్రకాష్ రావు, ఏండీ యాకూబ్, బాలయ్య, గౌరి శెట్టి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

