Solar CCTV | ధర్మారం ,సెప్టెంబర్ 17: ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన దామోదర్ సౌజన్యంతో మండల పరిధిలోని మేడారం గ్రామంలోని శ్రీ అమరేశ్వరస్వామి ఆలయంలో సోలార్ సిసి కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఇటీవల ఆలయంలో ని హుండీ చోరీ అయిన నేపథ్యంలో భవిష్యత్తులో చోరీ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలని ఆలయ చైర్మన్ ఆవుల రాజేశం ఫోన్ ద్వారా ఎన్నారై దామోదర్ యాదవ్ విన్నవించారు.
అందించిన దామోదర్ డబుల్ సోలార్ సిసి కెమెరాలు పంపగా వాటిని బుధవారం దామోదర్ ఫౌండేషన్ ఇన్చార్జి వేల్పుల నాగరాజు అందజేయగా వాటిని ఆలయం ఆవరణలో బిగించారు. సహకారం అందించిన ఎన్ఆర్ఐ కి ఆలయ కమిటీ చైర్మన్ రాజేశం, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేశం యాదవ్,గౌరవ అధ్యక్షుడు ఉత్తం రాజయ్య,ఆలయ కమిటీ వైస్ చైర్మన్ దేవి కొమరేష్, జెడ్పి హై స్కూల్ మాజీ చైర్మన్ ఐరిపల్లి శ్రీనివాస్,ఆలయ కోశాధికారి వీర్ పాల్, సభ్యులు శరత్,పంజాల శ్రీనివాస్, కన్నా అనిల్ కుమార్, కొమ్మ లచ్చన్న, సంధినేని సంతోష్, వెలిశాల సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.