Social punishment | ఫర్టిలైజర్ సిటీ జూన్ 9 : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ లకు పట్టుబడ్డ 28 మంది మందుబాబులకు జరిమానాతో పాటు సామాజిక సేవలో భాగం గా మొక్కలు నాటించారు. పోలీసుల కథనం ప్రకారం.. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన పలువురిని కోర్టు డ్యూటీ అధికారి అభి సోమవారం ఒకటో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ సారిక ఎదుట హాజరు పరిచారు.
కాగా 24 మంది మందుబాబులకు ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా మరో నలుగురికి రూ.2500 జరిమానా విధించారు. దాంతో సామాజిక సేవ లో భాగంగా వారితో కోర్టు ఆవరణలో మొక్కలు నాటాలని ఆదేశించారు. దీంతో మందుబాబులు ఫైన్ చెల్లించి, కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.