మానకొండూర్ రూరల్, మార్చి 9 : మానకొండూర్ నియోజక వర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లో ఆదివారం పొగమంచు కమ్మేసింది(Smog blankets). దీంతో వేకువజామున వివిధ పనులకు వెళ్లే కార్మికులు, రైతులు, వాకింగ్‌కు వెళ్లిన వారంతా ఇక్కట్లకు గురయ్యారు. వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై పొగమంచు దుప్పటి కప్పేయడంతో వాహన చోదకులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దీంతో వాహన దారులు హెడ్లైట్లు వేసుకొని రాకపోకలు సాగించారు.
మండలంలోని చెంజర్ల, ముంజంపల్లి, ఈదుల గట్టేపల్లి, రాఘవాపూర్, గంగిపల్లి, గట్టుదుద్దెనపల్లి, అన్నారం, మానకొండూర్ పలు గ్రామాల్లో ఉదయం 6.45 నుండి 7.15 నిమిషాల కాల వ్యవధిలో ఒక్కసారిగా పొగమంచు కమ్ముకుంది. వ్యవసాయ క్షేత్రాలకు అధికంగా ఉండడంతో సమీపంలోని చెరువులు, రిజర్వాయర్ల సమీపంలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పొలాలకు వెళ్లే రైతన్నలకు ఎం కనబడకుండా పోయాయి.