విద్యానగర్, నవంబర్21: కొత్తపల్లి మండలం మలాపూర్‌లో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. భూతగాదాలు, వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని, ఈ క్రమంలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ గౌస్ఆలం పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. మలాపూర్ గ్రామానికి చెందిన దేవునూరి సతీశ్‌కు, కవ్వంపల్లి దినేశ్(40) మధ్య భూమి అమ్మ కం విషయంలో కమిషన్ కోసం గొడవలు జరుగుతున్నాయి. అలాగే దేవునూరి సంతో ష్ ఓ మహిళతో సన్నిహితంగా ఉండగా, ఈ విషయంపై చంపుతానని పలుమార్లు దినేశ్ బెదిరించాడు. ఈ విషయాన్ని సంతోష్ తన అన్న శ్రావణ్‌కు చెప్పాడు.
దినేశ్ వలన తమ ఇద్దరికి ముప్పు ఉంది. ఎలాగైనా అతడిని చంపాలని వారు నిర్ణయించుకున్నారు. అయి తే 2024 ఫిబ్రవరి 25న శ్రావణ్ వాళ్ల వదిన చనిపోవడంతో దినేశ్ అకడికి వచ్చాడు. ఇదే అదునుగా భావించి దినేశ్‌ను మట్టుబెట్టాలని సంతోష్, శ్రావణ్ పథకం పన్నారు. కరీంనగర్ నుంచి కారును కిరాయికి తీసుకువచ్చా రు. అదే రోజు సాయంత్రం దినేశ్‌కు సతీశ్ మద్యం తాగించి ప్రణాళిక ప్రకారం మలాపూర్ కెనాల్ వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొందరు దినేశ్‌ను చితకబాది కారులో నూకపల్లి శివారుకు తీసుకెళ్లారు. అక్కడ సతీశ్ ఓ తాడును దినేశ్ మెడకు బిగించాడు. ఆ తర్వా త అందరూ కలిసి దినేశ్ కాళ్లు, చేతులకు తాళ్లు కట్టి చొప్పదండి శివారులోని కెనాల్ లో పడేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితులైన దేవునూరి సతీశ్, శ్రావణ్ గతంలో గంగాధరలో ఒక వృద్ధురాలిని హత్య చేసి జైలుకు వెళ్లారు. సమాచారం మేరకు చొప్పదండి సీఐ మలాపూర్‌లో శ్రావణ్ ఇంటి వద్ద దాడి చేసి, అకడ ఉన్న నిందితులను (దేవునూరి సతీశ్, దేవునూరి శ్రావణ్, దేవునూరి రాకేశ్, కుమ్మరి వికేశ్, జంగ చిన్నారెడ్డి, దేవునూరి సంతోష్)ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చేధించిన సీఐలు ప్రదీప్‌కుమార్, బిల్లా కోటేశ్వర్, ఎస్ఐలు నరేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, రాజు, సాంబమూర్తి, సిబ్బందిని సీపీ అభినందించారు.