sultanabad | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 06: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి గ్రామంలోని సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ రామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా భక్తజన సందోహం మధ్య వేద పండితుల మంత్రాల మధ్య నిర్వహించారు. కల్యాణానికి ముందు హోమం కార్యక్రమాన్ని నిర్వహించగా దంపతులు పాల్గొని హోమం చేశారు.
గ్రామం తో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. రాత్రి 8 గంటలకు శ్రీ సీతా రామాంజనేయ భజన మండలి భూపతి పూర్ బృందంచే శ్రీ సీతారామ చంద్రస్వామి చిరుతల రామాయణం ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దీకొండ భూమేష్ కుమార్ , ఆలయ కమిటీ సభ్యులతోపాటు తదితరులు పాల్గొన్నారు.