SIRICILLA | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 4: జూన్ మాసంలో సిపిఐ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తెలిపారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ మహాసభ శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు హాజరై మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభ జూన్ 12, 13 తేదీలలో తంగళ్ళపల్లి మండలంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో జిల్లా మహాసభలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ లోపు మండల మహాసభలను మే మాసంలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా పోయిన సంవత్సరానికి ఒక్కొక్క కార్మి కార్మికునికి రోజుకు రూ.300 ఇచ్చి ఈ సంవత్సరానికి కేవలం ఒక్కొక్క కార్మికునికి ఏడు రూపాయలకు కూలి పెంచడాన్ని కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలో ఉన్న 10 కోట్ల మందికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెంచాలని రోజుకు రూ.800 ఇవ్వాలని అది సంవత్సరములో 200 రోజులు పని కల్పించాలని సీపీఐ కోరుతూనే ఉందన్నారు. రూ.7ఏడు పెంచడం అనేది కార్మికుల్ని అవమాన పరచడమే అవుతుందనీ ,నిత్యవసర ధరలకు అనుగుణంగా కూలిని పెంచాలని, కానీ ఏదో ఒక నేపంతో ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికులకు మౌలిక వసతులు అయిన టెంట్, ప్రథమ చికిత్స కిట్టు, పారా గడ్డపార తట్ట ప్రభుత్వాలే ఇవ్వాలని, అది కూడా ఇవ్వలేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట మండలం పొత్తూరు కు చెందిన 70 సంవత్సరాల లింగయ్య గుండెజబ్బుతో మృతి చెందాడని, ఆయన కుటుంబానికి రూ.ఐదు లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గ్రామ శాఖ కార్యదర్శిగా బాచుపల్లి శంకర్, సహాయ కార్యదర్శిగా బర్ల శ్రీనివాస్ ఎన్నుకయ్యారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, శంకరానందు, బాలమల్లు, రాజయ్య, సుదర్శన్ రాజలింగం కమలాకర్, చంద్రశేఖర్ శ్రీనివాస్, నరసయ్య లక్ష్మణ్ బాలరాజు అనిల్ మహేష్, రమేష్, అభిలాష్, బాలయ్య పాల్గొన్నారు.