Putta Madhukar | రామగిరి, సెప్టెంబర్ 5 : సింగరేణి మైన్స్ గేట్ల నుంచి కాంగ్రెస్, ఏఐటీయూసీ నాయకులను తరిమికొట్టకపోతే సింగరేణికి మనుగడ ఉండదని, అన్యాయాలు, అక్రమాలే జరుగుతాయని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 420 హామీల 6 గ్యారంటీ లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపు చేస్తామని తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులైనా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రామగిరి మండలం లద్నాపూర్ లోని ఓసిపి 2 మైన్ పై టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజులు అని చెప్పి వేయి రోజులైనా కాంగ్రెస పార్టీ వాళ్లకు ఉలుకు లేదు పలుకు లేదన్నారు. దేశానికి వెలుగులు ఇచ్చే సింగరేణి కార్మికులను అప్రమత్తం చేయాలని కేటీఆర్ పిలుపుమేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎప్పుడు తన నిజస్వరూపాన్ని మార్చుకోదని ఊసరవెల్లిలా ఏ విధంగా అవకాశం వస్తే ఆ విధంగా మలుచుకుంటుందని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరిని అసహించుకుంటున్నా చాలా గొప్పగా చేస్తున్నాం.. మేమే చాలా గొప్ప అని చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మెడికల్ అన్‌ఫిట్‌కు 50మంది వెళ్తే అందులో ముగ్గురు అన్పిట్ అయి 43మంది ఫిట్ అవుతున్నారని, ఇదేక్కడి న్యాయమని నెత్తి నోరు కొట్టుకున్నా కాంగ్రెస్, ఏఐటీయూసీ వాళ్లు గేట్ల వద్దే ఆపుతున్నారని ఆయన అన్నారు. సింగరేణి కార్మికులు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని, 15ఏండ్ల కిందట బావుల కాడికి కాంగ్రెస్సోళ్లు వస్తే తరిమి కొట్టిండ్లని, మళ్లీ తరిమి కొడితేనే కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికే సింగరేణిని మొత్తం అమ్మేశారని, వేలకోట్లకు కుదుగ పెట్టుతాండ్లని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల పక్షాన ప్రతిపక్షాలు గొంతువిప్పితే హక్కును హరిస్తే ఇప్పటికే ఎర్రజెండాలు కనుమరుగు అవుతున్నాయని, ఏఐటీయూసీ పరిస్థితి అలాగే తయారైందన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి అక్రమాలు అన్యాయాల్లో బాగస్వాములయ్యారో అప్పుడే ప్రజల హృదయాల నుంచి పోయిండ్లని అన్నారు. గతంలో కార్మికులే రోడ్లు ఎక్కేది కానీ అధికారులు రోడ్లు ఎక్కి నిరసనలు చేస్తున్న దుస్థతి ఈ ప్రభుత్వంలో నెలకొందన్నారు. 420హమీలు రాసిన స్తానిక ఎమ్మెల్యే గనుల మీదకు వచ్చి అనేకం చెప్పిండని మారుపేరు వాళ్లను తాము అధికారంలోకి రాంగనే తీసుకుంటమని, వాళ్లకు పరిష్కారం చూపిస్తమని మూడేళ్లు గడుస్తున్నా కనీసం ఆ ఊసే ఎత్తడం లేదని, మంత్రి కాగానే బుల్లెట్ ప్రూప్ వాహనం వచ్చిందని గ్లాసు మాత్రం దించుతలేడని విమర్శించారు. దుద్దిళ్ల శ్రీధర్‌కు ఎప్పుడు మంత్రి పదవి వస్తే అపుడు అన్నం పెట్టెటోళ్లకు సున్నం పెడుతాడని, ఐటీ మినిష్టర్ అయి ఇండ్లను కూలగొడుతాండని ఆయన ఎద్దేవా చేశారు. మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే ఐటీ మంత్రి అని, ఆయన చేతిలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు పది మందికి ఉద్యోగాలు ఇయ్యలేదని, ఈ ప్రాంతానికి ఒక ఇండస్త్రీ, ఒక పరిశ్రమ పెట్టలేదని, కనీసం ప్రతిపాదనలు కూడా చేయలేదన్నారు.
మన బావితరాల భవిష్యత్ గురించి ఆలోచన చేయని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బొగ్గు, నీళ్లు, అడవి, ఆలయాలు, భూములు ఉన్నా నియోజకవర్గంలో భవిష్యత్ గురించి ఆలోచన చేయకుండా ఇండ్లను కూలగొడుతూ వ్యాపారులను రోడ్డున పడేశాడన్నారు. మంత్రిగా అయిన మొదటి ఏడాదే తాను అడిగానని, మీ కుటుంబం 40ఏండ్లుగా అధికారంలో ఉంటున్నరు మంథనిలో రెండు కాటారంలో రెండు ఐటీ కంపెనీలు పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించమని అడిగా ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. మనం ఓటు వేస్తే వాళ్ల కుటుంబం ఆమెరకాకు పోయిండ్లే తప్ప ఇప్పటి వరకు మన పిల్లలు అమెరికాలకుపోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కలర్, కులం చూసి మోసపోతున్నరని అన్నారు. ఎనిమిది సార్లు ఓట్లేసి 40ఏండ్లు అవకాశం కల్పించామని, కానీ ఎప్పుడు ఆయనను ఏం చేసిండని అడుగాలనే ఆలోచన చేయలేదని అన్నారు. కళ్ల ముందే బీటెక్ ఎంబీఏ ఎంటెక్‌లు చేసి రోడ్ల మీదనే తిరుగుతున్నారని, ఒక్క ఉద్యోగం ఇవ్వరు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. దుద్దిళ్ల కుటుంబంపేరు మీద పది ఐటీ కంపెనీలు ఉన్నాయని, అయినా ఒక్కటి ఇక్కడకు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చి వ్యక్తి ఎంత అభివృద్ది చేయచ్చో అందరు అర్థం చేసుకోవాలని, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఎంతో అభివృద్ది చేస్తారని, కానీ తండ్రి, కొడుకులు 40ఏండ్లుగా అదికారంలో ఉంటూ మంథనికి చేసింది శూన్యమని అన్నారు.
సింగరేణి కార్మికులు కష్టపడి చెమట రక్తాన్ని చిందించి బొగ్గు తీస్తే ఆ బొగ్గుతో వచ్చిన డీఎంఎఫ్టీ నిధుల్లో 300కోట్లతో పెద్దపల్లి కాటారం వరకు తీసుకువచ్చామని, రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేశామని, 95శాతం రోడ్డు పనులు కాగా కేవలం 5శాతం మిగిలిపోయిందన్నారు. కానీ మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ మిగిలిన నాలుగు కిలోమీటర్ల రోడ్డుకు మూడేళ్లు గడుస్తున్నా తట్టెడు మట్టిపోయలేదని అన్నారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గానిదేనని కాంగ్రెస్ ఏఐటీయూసిని తరిమికొడితేనే సింగరేణిని రక్షించుకోగలమని ఆయన సూచించారు. ఇప్పటికే అనేక మంది సింగరేణి అధికారులు కాంగ్రెస్ కండువాలు కప్పుకుని పని చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాబోతుందని, కార్మికులను ఇబ్బంది పెట్టే అధికారులను వదిలిపెట్టమని రిటైర్డ్ అయినా పనిస్మెంట్ తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ గేట్ మీటింగ్ లో టి బీజీకేఎస్ నాయకులు దేవ శ్రీనివాస్, వేముల రవిశంకర్ గౌడ్, దాసరి మల్లేష్,ఇసంపల్లి రమేష్, సైండ్ల సత్యనారాయణ, జిటుక్ శ్రీనివాస్, అల్లం రమేష్, బీఆర్ఎస్ నాయకులు పూదరి సత్యనారాయణ గౌడ్, మ్యాదరవేన కుమార్ యాదవ్ ,శంకేశి రవీందర్ , కాపుర బోయిన భాస్కర్, వేగోలపు మల్లయ్య , రోడ్డ శ్రీనివాస్, మెడగోని రాజన్న, పుల్లెల కిరణ్, ఇబ్రాహీం అసం, బర్ల కుమార్, తిరుపతి, బొంకూరి పోషం, మైదం సత్యనారాయణ, కాట అనీల్ తదితరులు పాల్గొన్నారు.