Singareni | రామగిరి మే 15: సింగరేణి అర్జీ-3 డివిజన్ ఓసీపీ-2 వద్ద జరుగుతున్న ఎల్-6 కెనాల్ మల్లింపు పనుల్లో వెలువడిన పెద్ద బండ ను తొలిగించేందుకు సింగరేణి అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేశారు. దీంతో భారీగా పేలుడు సంభవించి సమీపంలో ని నాగేపల్లి గ్రామ సీ బ్లాక్ ఏరియా నివాసలపై పై బండ రాళ్లు పడి రాళ్ల వర్షం కురిసింత బిభాత్సం తో ఏమి జరుగుతుందో తెలియక ఉలిక్కి పడ్డారు. వారంతా తెరుకునే లోపే తాకిన రాళ్ల తాకిడికి రక్తం కారుతూ గాయాలు పాలయ్యారు. ఈ బ్లాస్టింగ్ వాళ్ల గ్రామం లోని పది మందికి తీవ్ర గాయాలు కాగా చాలా మంది కి తృటీ లో ప్రమాదం తప్పింది. ఎగిరి వచ్చిన పెద్ద పెద్ద బండలు ఇండ్ల పై పడడం తో బిటలు పడ్డాయి.
ఎలాంటి హెచ్చరిక లేకుండా సింగరేణి చేపట్టిన పేలుళ్లకు నిరసన గా గ్రామస్తులు తమ గ్రామ అడ్డరోడ్ అయిన మంథని పెద్దపల్లి ప్రధాన రహదారి లో భైఠాయించారు. దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దింతో రోడ్ పొడవున బస్సులు ఇతర వాహనాలు నిలిచి పోయాయి. సమాచారం అందుకున్న గోదావఖని ఏసీపీ మడత రమేష్, మంథని సీఐ, రాజు, ఎస్సై చంద్రకుమార్ పోలీస్ బాలగాల తో పరిస్థితి ని సమీక్షించి ఆందోళన కారులను వారించే ప్రయత్నం చేశారు.
సింగరేణి అధికారులు వచ్చి ఈ ఘటన పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏసీపీ అర్జీ-3 జీఎంతో మాట్లాడి ఘటన వద్దకు పిలిపించ్చారు. పేలుళ్ల పై జరిగిన నష్టం పై కొద్ది సమయం అధికార్లను గ్రామస్తులు నిలదీశారు. పేలుళ్ల వల్ల జరిగిన నష్టం పై తక్షణమే పరిశీలించి తాగు పరిహారం లేదా ఇండ్ల కు మరమ్మతులు చేపట్టి గాయలైన వారికి వైద్యం చేయిస్తామని, ఈ ఘటన పై శాఖ పరమైన చర్యలు చేపట్టి ఇలాంటి ఘటన పునరా వృత్తం కాకుండా చూస్టమని జి ఎం సుధాకర్ రావు నాగేపల్లి గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. గ్రామస్తులకు మద్దతుగా ఇందులో గ్రామ మాజీ సర్పంచ్ కొండవేన ఓదెలు, బీఆర్ఎస్ నాయకులు శంకేసి రవీందర్, పూదరి సత్యనారాయణ, కాపురబోయిన భాస్కర్, కొండ వేన ప్రభాకర్, అనిల్, సుధాకర్ పాల్గొన్నారు.
పర్మిషన్ లేని బ్లాస్టింగ్ చేపట్టొద్దు..
సింగరేణి అధికారులు ఐ ఈ డి పర్మిషన్ లేకుండా బ్లాస్టింగ్ చేయవద్దని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఆయన నాగేపల్లి గ్రామాన్ని సందర్శించారు. పెల్లుళ్ల వల్ల జరిగిన ఇది చట్టప్రకారం నేరమన్నారు. అర్జీ-3 లో అవగాహనా లేని కొందరు అధికార్ల వల్ల ఇటువంటి ఘటలు చోటు చేసుకున్నాయ ని అన్నారు. బొగ్గు గనులకు అనుబంధం గా జరుగుతున్న పనులకు సమీపంలో ని గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఓసీపీ-2 కెనాల్ మల్లింపు లో సంబధిత అధికార్ల పర్యవేక్షణ లోపం స్పష్టంగా తెలుస్తుండన్నారు. పేలుళ్ళ లో నాగేపల్లి ప్రజలు గాయపడం బాధ కరమైన విషయమాన్నారు. దీనికి అర్జీ-3 యాజమాన్యం పూర్తి బాధ్యత వహించి వారికి తాగు న్యాయం చేయాలన్నారు.