కమాన్చౌరస్తా, జూన్ 12: మన విద్యార్థులు విదేశాల్లో చదువుకొనేందుకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిగ్ ఓవర్సీస్ దశాబ్ద కాలం నుంచి సహకారం అందిస్తున్నదని సంస్థ డైరెక్టర్ గంజి అభిషేక్ పేర్కొన్నారు. వేలాది విద్యార్థులకు వారి వారి అర్హతలను బట్టి వివిధ దేశాలకు తమ సంస్థ ద్వారా విజిట్ వీసా అందిస్తున్నట్టు వివరించారు. తమ వద్ద ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (కెమ్బ్రిడ్డ్ ఆథరైజ్డ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్) సెంటర్ అందుబాటులో ఉన్నదని, ఇది తెలంగాణలోనే రెండోదని చెప్పారు.
అందులో ఐఈఎల్టీఎస్, పీటీఈ, టోఫెల్, ఓఈటీ, జీఆర్ఈ, ఎస్ఏటీకి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. శిక్షణ పొందినవారి అర్హతలకు అనుగుణంగా వివిధ దేశాలకు అప్లికేషన్లు, వీసా డాక్యుమెంటేషన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే, ఇక్కడి నుంచి విదేశాలకు పంపించిన విద్యార్థులకు అక్కడ పికప్, అకామిడేషన్ సర్వీస్ అందిస్తున్నట్టు వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు కరీంనగర్లోని సిగ్ ఓవర్సీస్ సర్వీసెస్ ఆఫీస్ లేదా 9885531674 నంబర్లో సంప్రదించాలని సూచించారు.