Shubharambam | విద్యానగర్, ఆగస్టు 24: ఆల్ట్రాటెక్ ఇండియా నెంబర్ వన్ సిమెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన శుభారంభం బిల్డ్ ఎక్స్ పో ఆదివారం కరీంనగర్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఎక్స్ పో కార్యక్రమంలో నిర్మాణ రంగానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఉత్పత్తులు, నాణ్యమైన సిమెంట్ వినియోగంపై విస్తృతంగా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
ఎక్స్ పోలో సిమెంట్ ఉత్పత్తు ప్రీకాస్ట్ సొల్యూషన్స్, బ్లాకులు, సస్టైనబుల్ కన్ స్ట్రక్షన్ విధానాలు, ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైనింగ్ మోడల్స్, పెయింట్స్, వాటర్ హార్వెస్ట్ వంటి అనేక విభాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో సేల్స్ హెడ్ అవిజిత్ చక్రవర్తి, టెక్నికల్ హెడ్ నందిక శ్రీనివాస్, టీఎస్చ్లు సంతోష్, అనిల్ కుమార్ వర్మ, టెక్నికల్ ఇన్చార్జిలు శ్రీకాంత్, సురేష్, కరీంనగర్ జిల్లా ఇంజినీర్స్, డీలర్స్, ఇంటి నిర్మాణ యజమానులు, కంపెనీ సేల్స్, టెక్నికల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.