Mallapur | మల్లాపూర్, జూలై 20 : జగిత్యాల జిల్లా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఇటైడి శేఖర్ రెడ్డి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సోమవారం నియమాక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బీజేవైఎం బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.