Timmapur | తిమ్మాపూర్, జనవరి 20 : తిమ్మాపూర్ ఇన్చార్జి సబ్ రిజిస్టార్ గా ట్రైనీ జిల్లా రిజిస్టార్ షాగుప్తా ఫిర్దోస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తిమ్మాపూర్ లో ఇన్చార్జ్ సబ్ రిజిస్టర్ గా ప్రస్తుతం పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ విజయ పర్యవేక్షణలో ఆమె మూడు నెలల పాటు సబ్ రిజిస్టార్ గా శిక్షణ తీసుకోనున్నారు.
ఇటీవల గ్రూప్ వన్ ఫలితాలలో జిల్లా రిజిస్టర్ గా ఉద్యోగం సాధించిన షాగుప్త ఫిర్దోస్ కరీంనగర్ జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇక్కడ కూడా మరో మూడు నెలల పాటు శిక్షణ పొందనున్నారు. ఆమెకు కార్యాలయ సిబ్బంది విజయ, మంజుల, అశ్వక్, బేగ్,బలరాము లు పూల మొక్కతో స్వాగతం పలికారు.