కోరుట్ల: కోరుట్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఏడుగురు యువకులు గాయపడ్డారు. పట్టణంలోని సర్వర్ నగర్‌కు చెందిన ఏడుగురు యువకులు మారుతీ నగర్ ప్రాంతంలో చాయ్ తాగేందుకు కారులో బయల్దేరారు. ఈ క్రమంలో మారుతీనగర్ శివారులో అదుపుతప్పిన కారు.. చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్నవారందరికీ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో నుంచి వారిని బయటకు తీసి కరీంనగర్, నిజామాబాద్ దవాఖానలకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. బాధితులను ఆవేస్, ఫయాజ్, మౌలానా ఆమేర్, సైఫ్, సమీర్, ఫుర్ ఖాన్, కైఫ్‌గా గుర్తించారు.
మరో ఘటనలో భద్రాద్రి కొత్తగూడం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాపడ్డారు. క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.