Service programs | వీణవంక, జూన్ 14: మండల కేంద్రంలోని స్థానిక శివాలయం ఆవరణలో వీణవంక వాసవీ, వనిత క్లబ్ ఆధ్వర్యంలో డాన్ టు డెస్క్ భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల వాసవీ, వనిత క్లబ్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వళన చేశారు. అనంతరం శివాలయం అర్చకులకు నిత్యావసర సరుకులు, శివాలయానికి 4 సిమెంట్ బెంచీలు, విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, కంపాక్స్ బాక్స్‌లు, చిరు వ్యాపారులకు గొడుగులు, అందజేశారు.
అలాగే డయాగ్నస్టిక్స్ సెంటర్ సహకారంతో సుమారు 200 మందికి షుగర్ పరీక్షలు నిర్వహించారు. మండలంలోని వీణవంకు చెందిన వోరెం వెంకటయ్య, నర్సింగాపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలోముఖ్య అతిథులు క్రిష్ణవేణి, అల్లెంకి లచ్చయ్య, జిల్లా ఆఫీసర్లు గంప సురేందర్, కేసరి, ఆర్సీ అయిత రమాదేవి, జేసీ రామిడి శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షురాలు అయిత స్వాతి, హరిబాబు, ప్రధానకార్యదర్శులు విజయలక్ష్మి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.