Potkapalli | ఓదెల, జులై 28 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి రైతు వేదిక లో విత్తన మేళా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ సూపర్ ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడనున్నట్లు పేర్కొన్నారు. గతంలో కంటే లోటు వర్షపాతం నమోదు అవుతుందన్నారు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్ల వేసిన పంటలు కూడా భారీగా దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు.
రైతులు అధిక నీటి వినియోగ పంటల సాగుకి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లా యంత్రాంగం సబ్సిడీపై కంది, పెసర, ఆముదం విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. వివరాలకు సంబంధిత ఏఈఓలను సంప్రదించాలి కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంబలా సారమ్మ-కొమురయ్య, ఏఈవో మౌనిక, పెస్టిసైడ్ డీలర్స్ ఆకినపల్లి రమేష్, ఇరుకుల్ల శ్రీనివాస్, రమేష్, తీర్థాల శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.