CHIGURUMAMIDI | చిగురుమామిడి, అక్టోబర్ 11: చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాషబత్తిని ఓదెలు కుమార్ కు సైన్స్ అకాడమీ(మాస్టర్ ఆఫ్ టీచర్స్ సైన్స్ ఎడ్యుకేటర్) టెక్ మహేంద్ర ఫౌండేషన్ వారు అవార్డు ప్రదానం చేశారు.
గతంలో 2021- 22 విద్యా సంవత్సరంలో హైదరాబాదులోని సైన్స్ అకాడమీలో టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రయోగాలపై శిక్షణ తీసుకొని తదుపరి జిల్లాలోని సమస్త సైన్స్ ఉపాధ్యాయులకు, పాఠశాలలోని విద్యార్థులకు సైన్స్ టెంపర్ ను అభివృద్ధి చేస్తున్నందుకు ఈ అవార్డు ప్రధానం చేసానట్లు అవార్డు గ్రహీత ఓదెలు కుమార్ తెలిపారు.
ఈ అవార్డు పట్ల జిల్లా విద్యాధికారి మొండయ్య, ఎస్ .ఓ. అశోక్ రెడ్డి, ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి, డీసీఈబీ సెక్రెటరీ భగవంతయ్య, మండల విద్యాధికారి పావని , ఉపాధ్యాయ బృందం ఓదెల కుమార్ ను అభినందించారు.