Chigurumnmidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 28 : చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డిపల్లె పరిధిలోని బరిగేలపల్లె ప్రభుత్వ పాఠశాలలో రికార్డులు భద్రత కొరబడిందని ‘నమస్తేతెలంగాణ’ కథనానికి స్పందించిన ఎంఈఓ జయప్రద శనివారం పాఠశాలను సందర్శించారు. రెండు సంవత్సరాలుగా పాఠశాల మూతపడడంతో చుట్టుపక్కల పిల్లలు ఆటలాడుతూ పాఠశాల తాళం పగలగొట్టడం జరిగిందని, కోతులు పాఠశాల లోపటికి వెళ్లి రికార్డులు, స్టేషనరీని చిందరవందరగా చేసినట్లు ఎంఈఓ తెలిపారు.
వాటన్నింటినీ సరిచేసి పరిచినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి గాను పాఠశాలను పున: ప్రారంభిస్తామని ఎంఈఓ పేర్కొన్నారు. ఎంఈవో వెంట సుందరగిరి కాంప్లెక్స్ హెచ్ఎం సుమలత, సర్పంచ్ సన్నిళ్ళ కవిత, మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ సన్నీల్ల వెంకటేశం, వార్డు సభ్యుడు శ్రీనివాస్, సీఆర్పిలు శ్రీనివాస్, ఆంజనేయులు, వెంకటేష్ తదితరులున్నారు.