Exam Schedule | కమాన్ చౌరస్తా, ఆగస్టు 8 : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ ద్వితీయ సెమిస్టర్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను పరీక్షల నియంత్రణ విభాగం విడుదల చేసింది. ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థుల థియరీ పరీక్షలు ఆగస్టు 12 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డీ సురేష్ కుమార్ తెలిపారు.
ప్రతీరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు టైమ్‌టేబుల్, పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాలను తమ కళాశాలల్లో తెలుసుకోవాలని సూచించారు. అలాగే మరిన్ని వివరాల కోసం శాతవాహన విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.